Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజుగాడు' వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు!

  • రాజ్ తరుణ్ తాజా చిత్రంగా 'రాజుగాడు'
  • కథానాయికగా అమైరా దస్తూర్
  • సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు 
  • నేనూ రెడీ అంటోన్న 'రాజుగాడు' 
సంక్రాంతి బరిలోకి దిగే సినిమాలు ఖాయమైపోయాయి. బాలకృష్ణ 'జై సింహా' .. పవన్ 'అజ్ఞాతవాసి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ వున్న సూర్య, తన తాజా చిత్రం 'తానా సెరిందా కూట్టమ్'ను తెలుగులో 'గ్యాంగ్' పేరుతో సంక్రాంతికే విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన 'రాజుగాడు' రాకపోవచ్చనే ప్రచారం మొదలైంది.

సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ నటించింది. భారీ సినిమాలు సంక్రాంతికి వస్తుండటంతో .. థియేటర్ల సమస్య తలెత్తడమే కాదు .. వసూళ్లపై కూడా ప్రభావం పడే ఛాన్స్ వుంది. అందువలన ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గవచ్చని అనుకున్నారు. కానీ యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, వాళ్ల హాలిడేస్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ సినిమా సంక్రాంతికే వచ్చే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. 
raj tarun
amyra dastur

More Telugu News